తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ‘మనం’ సినిమా మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 2014 మే 23న తొలిసారి విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు జపాన్‌లో 2025 ఆగస్టు 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, అక్కినేని నాగార్జున తన జపనీస్ అభిమానులతో వర్చువల్‌గా సంభాషించనున్నారు. ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులను ఒకే తెరపై చూపించిన అరుదైన సినిమా. ఈ సినిమాలో దిగ్గజ నటుడు…