భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.