గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు…