అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైంది? రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి. రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు పవన్. ఇటీవలే పల్నాడు, కర్నూలు నంద్యాల జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్రగాఢ…