Jamuna Memories: మొన్ననే కేంద్రం ‘పద్మ’ అవార్డులను ప్రకటించినప్పుడు నాటి అందాలతార, మేటి నటి జమునకు ఇప్పటి దాకా ఎందుకని ‘పద్మ’ పురస్కారం లభించలేదన్న చర్చ తెలుగుసినిమా జనాల్లో చోటుచేసుకుంది. ఆ చర్చ ఇంకా ముగింపు రాకుండానే మహానటి జమున కన్నుమూశారన్న వార్త ఆమె అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తిందనే చెప్పాలి. తెలుగుతెరపై జమున లాగా వెలిగిన తార మరొకరు కానరారు. దాదాపు పాతికేళ్ళు నాయికగా రాణించారామె. అనితరసాధ్యంగా తనదైన అభినయంతో తెలుగువారినే కాకుండా, తమిళ, కన్నడ, హిందీ…