మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా నేరుగా వాగు వద్దకు చేరుకుని తమ మొక్కులు…