Operation Sindoor : జమ్మూ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదుల చొరబాట్లు, ముఖ్యంగా ట్యూబ్-లాంచెడ్ డ్రోన్‌ల ప్రయోగానికి వినియోగించిన పాకిస్తానీ పోస్టులు , ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత సైన్యం సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం , ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా, జమ్మూ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల…
జమ్మూలో ఈరోజు భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీని తరువాత ఎయిర్ సైరన్లు మోగాయి. జమ్మూ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. జమ్మూలో 5-6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించాయి. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు భారత సైన్యం…