Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరోసారి పాకిస్తాన్ రేంజర్లు బరితెగించారు. సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. మక్వాల్ లోని సరిహద్దు ఔట్‌పోస్టు వెంబడి బీఎస్ఎఫ్ సిబ్బంది, సరిహద్దు అవతలి వైపు నుంచి వస్తున్న కాల్పులను తిప్పికొట్టారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాలకు పైగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. భారత్…