తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి…