జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని పిన్ని అయ్యే మహిళ దారుణంగా గొంతు కోసి చంపేసింది. కేవలం ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఉన్న అసూయతోనే అఘాయిత్యానికి పాల్పడింది. అంతే కాదు బాలికను చంపేసి ఏం తెలియనట్లు డ్రామా అడిన కిలాడీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక..అదే కాలనీలోని మరొకరి ఇంటిలో శవమై…