కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ…