గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా మథన పడుతున్నారట గురునాథరెడ్డి. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని కోస్గి పట్టణానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ కార్యక్రమానికి గురునాథరెడ్డిని ఆహ్వానించలేదట. అయినప్పటికీ బహిరంగ సభ వద్దకు వచ్చిన…