జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు…