ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే…