సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ తర్వాత రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండొద్దు.. స్వచ్ఛంధ్రాలో అనకాపల్లి 13వ స్థానంలో ఉంది.. ర్యాంకింగ్ మెరుగుపడాలని సూచించారు. అలాగే, నాతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీల పని తనాన్ని పరిశీలిస్తున్నాను.. సమర్ధవంతంగా ఎలా పని చేయించాలో నాకు తెలుసు.. ఎవరినీ వదిలిపెట్టను అన్నారు.