గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.