భారత్ నుంచి పారిపోయి మలేసియాలో ఉంటున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు దయాది దేశం పాకిస్థాన్ సోమవారం రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఒమన్‌లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు. భారతదేశంలోని మెజారిటీ హిందువులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, ఇది ఓటు బ్యాంకు కోసం సమస్యను సృష్టిస్తోందని అన్నారు