Ishan Kishan In World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టును ఇవాళ ( డిసెంబర్ 20) బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లలో ఆడిన ఆటగాళ్లకే వరల్డ్ కప్‌లో కూడా ఆడే అవకాశం దక్కుతుందన్న అంచనాల మధ్య సెలెక్టర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌ను నేరుగా ప్రపంచకప్ తుది జట్టులో చోటు కల్పిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.