బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించి నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కిషన్ నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు బీహార్‌కు చెందిన సకిబుల్ గని పేరిట ఉంది, కిషన్ బుధవారం…