T20 World Cup: హోబర్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (34), హ్యారీ టెక్టార్ (45) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నె, ధనుంజయ డిసిల్వ…
Ireland Old Woman: ఐర్లాండ్‌లో 66ఏళ్ల వృద్ధురాలు కొన్ని కారణాల వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకోవటానికి చేసిన పని అక్కడి డాక్టర్లకు చెమటలు పట్టించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ఏకంగా 55 బ్యాటరీలను మింగేసింది. దీంతో కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వృద్ధురాలిని ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ మింగిన బ్యాటరీలలో AA, AAA బ్యాటరీలు ఉన్నాయి. తొలుత వైద్యులు మహిళ కడుపును ఎక్స్‌రే తీయగా ఇనుప…
సోషల్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల ($402 మిలియన్) జరిమానా విధించింది ఐర్లాండ్.. పిల్లల డేటా విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.. 2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్ యూజర్ల డేటాపై నిబంధనలు పాటించలేదని తేల్చింది ఐర్లాండ్.. పిల్లల ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ పేర్కొంది.. Read Also: Bharat Biotech’s Nasal Vaccine: కోవిడ్ 19…
Two Kerala youths died in Ireland: ఐర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటిలో ముగిని చనిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలురు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం వీరిద్దరు మరికొంత మంది స్నేహితులతో కలసి ఉత్తర ఐర్లాండ్ లో ఉన్న సరస్సుకు వెళ్లారు. చనిపోయిన వారిని జోసెఫ్ సెబాస్టియన్, రేవెన్ సైమన్ లు గా గుర్తించారు. వీరితో పాటు మరో 6…
Woman gets paid more than 3 lakh for being asked her age at a Domino's job interview: ఇంటర్యూలో మహిళ వయసు అడగమే డోమినోస్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు పరిహారంగా లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే వయసు అడిగితేనే లక్షలు చెల్లించాలా..? అని చాలా మంది ప్రశ్నించవచ్చు. అయితే వయస్సు అడిన తనపై వివక్ష చూపించారని ఫిర్యాదు చేయడంతో సదరు కంపెనీ దిగిరావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..…
వన్డేల్లో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు పసికూన ఐర్లాండ్ జట్టు చెమటలు పట్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (115 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (74 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిన్ అలెన్ (33), కెప్టెన్ లాథమ్ (30), గ్లెన్ ఫిలిప్స్ (47)…
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.…
టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9గంటలకు డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన హార్డిక్ పాండ్యా సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ వేగంగా ఆడటంలో తడబాటుకు గురైంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ డ్రా చేసుకోవచ్చని…
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. భారత…
డబ్లిన్ వేదికగా జరుగుతున్న భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం సృష్టించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు తొలి టీ20, మంగళవారం రెండో టీ20 జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్…