ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.