లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.