iPhone New Version: ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ సంస్థ అదిరిపోయే న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో ఐఫోన్స్ కి మొబైల్ నెట్‌వర్క్‌తో అవసరం లేకుండా.. ఏకంగా శాటిలైట్ తోనే మొబైల్ ఫోన్ కాల్స్, మెసేజ్, మ్యాప్స్ షేర్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన ఐఫోన్ 18 సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 18 సిరీస్ లాంచ్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఫీచర్స్ లీక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. యాపిల్ కంపెనీ ఈ సిరీస్ ఫోన్‌లను సరికొత్త రియర్ డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు. అదనంగా ఐఫోన్ 18 ప్రో సిరీస్ మూడు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నట్లు…