Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్‌పుట్‌లను సమర్పించింది. అయితే ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్' గరుడ పేరుతో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాలపై సోదాలు చేపట్టింది. ఇంటర్‌పోల్, ఎన్సీపీతో పాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ 'ఆపరేషన్ గరుడ'ను చేపట్టింది.