తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు…
ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్‌బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారి భవితవ్యం నేడు తేలనుంది.