ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. బర్త్‌డే సందర్భంగా ఆమె డెహ్రాడూన్‌లోని జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయం గడిపారు. దివ్యాంగ విద్యార్థులతో సంభాషించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, అతిథులను పలకరించారు. అధ్యక్షురాలు ముర్ము పుట్టినరోజు సందర్భంగా.. ఈ సంస్థ విద్యార్థులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రదర్శనను చూసిన ముర్ము భావోద్వేగానికి గురయ్యారు.