ఆ మహిళకు పెళ్లై మూడేళ్లు అయ్యింది. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల పాప కూడా ఉంది. కానీ ఆమె జీవితాన్ని వరకట్న వేధింపులు బలిగొన్నాయి. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యంలో 27 ఏళ్ల మహిళా ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త, అత్తమామల వరకట్న వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని…