ప్రముఖులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్‌ను కేటుగాళ్లు మోసం చేశారు. వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్‌ను రూ. 7 కోట్ల మేర మోసగించిన అంతర్-రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం ఛేదించారు.