చాలా మందికి ఉదయం లేవగానే నడిచే అలవాటు ఉంటుంది. ఉదయం నడవకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతారు. మార్నింగ్ వాక్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే. కానీ మార్నింగ్ వాక్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నా.. అధిక వాయు కాలుష్యం సమయంలో నడిస్తే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. వాయు కాలుష్యం అనేది గాలిలో ఉన్న హానికరమైన పదార్థాలను సూచిస్తుంది.