Tiger Reserve: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్, నార్సింగ్ పూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం, దామోహ్ జిల్లాలోని రాణి దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాన్ని విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.