పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన ప్రొవోకేషన్‌ను 7–5తో ఓడించింది. దీంతో.. సెమీస్ లోకి ప్రవేశించింది. కాగా.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది.