ఎ.ఆర్.రహమాన్ స్వరవిన్యాసాలకు అభిమానులు కానివారు ఎవరుంటారు? మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లోనూ కొన్ని పాటలతో ఆకట్టుకున్నారు రహమాన్. ఆయన మాయాజాలం ఇంకా పనిచేస్తూనే ఉందని చెప్పవచ్చు. ఆయన తెలుగువారు కాకపోయినా, ఆయనంటే మన తెలుగువారికి ఎంతో అభిమానం. అలాగే రహమాన్ తల్లి కస్తూరి జన్మస్థలం మన తెలుగునేలలోని హైదరాబాద్.