ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ను మిత్రదేశంగానే అభివర్ణిస్తూ.. విషంకక్కారు. మన దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా విమర్శలు గుప్పించారు. ఇండియా రష్యాతో స్నేహం కోరుకుంటోందని.. కానీ రష్యా లాగే "ఇండియన్ ఎకానమీ కూడా డెడ్ ఎకానమీ" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష…