Stock Market Analysis: ఇవాళ శనివారం, రేపు ఆదివారం స్టాక్ మార్కెట్‌లకు సెలవనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ వారంలోని మిగతా ఐదు రోజులు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఎలాంటి పనితీరును కనబరిచాయో తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. అందులోనూ.. స్టాక్ మార్కెట్‌పై పట్టున్న వ్యక్తులు ఆ అనాలసిస్ చేస్తే ఇంకా బాగుంటుంది. వెల్త్ ట్రీ గ్రూపు ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి ఇలాంటి నిపుణుల కోవలోకే వస్తారు.