USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరసగా భారతీయులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్, వలస విధానాలను కఠినతరం చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి H-1B వీసాలపై పడింది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు.