మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు మాదిరే.. ఈ మ్యాచ్‌లోనూ మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన భారత మహిళలు.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటుతున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ ఐదు కీలక వికెట్స్ కోల్పోయి పరాజయం దిశగా సాగుతోంది. పాక్ 31 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి…
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగినా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు కరచాలనం ఇవ్వలేదు. అంతేకాదు ఆసియా కప్ గెలిచినా పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కూడా నో హ్యాండ్‌షేక్ కొనసాగుతోంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని…