మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. ‘అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.…
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన…
WT20 Worldcup 2024: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 18వ మ్యాచ్‌లో అంటే ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ డూ-ఆర్-డై మ్యాచ్‌లో, చివరి మూడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆపై భారత్ ను 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితం చేసింది. ఇక ఈ ఓటమి…
Australia Women clinch t20 series vs India Women: ఆస్ట్రేలియాపై తొలిసారి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశంను భారత మహిళలు చేజార్చుకున్నారు. నిర్ణయాత్మక మూడో టీ20లో భారత మహిళా జట్టు ఓడిపోయింది. ముంబై వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆసీస్.. 2-1తో పొట్టి సిరీస్‌ను చేజిక్కించుకుంది. భారత్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.4 ఓవర్లలో మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి…
INDW vs AUSW 3rd T20: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు టీ20లో చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ పోరులో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి ఆస్ట్రేలియాపై స్వదేశంలో సిరీస్ పట్టేయాలని భారత్ పట్టుదలగా ఉంది. రెండో టీ20లో గెలిచి ఊపుమీదున్న ఆసీస్ కూడా సిరీస్ గెలవాలని చూస్తోంది.…
Australia Women won by 6 wkts vs India Women: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది. భారత్ నిర్ధేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో…
India defeated Australia for the first time in Women’s Test History: ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. మరో సంచలనం నెలకొల్పింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం.…