మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్‌లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89), దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్) చెలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఆదివారం…