India Post: భారత తపాలా (Postal) శాఖ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఒక కీలక మార్పు తీసుకువస్తోంది. ఇప్పటి వరకూ వేర్వేరుగా అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ సేవలను ఒక్కటిగా విలీనం చేసి.. ఇకపై అన్ని దేశీయ లేఖలు, డాక్యుమెంట్లు, పార్సెళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపే విధంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో సేవల వేగం, ట్రాకింగ్…