Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే జనరిక్ ఔషధాలపై సుంకాలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందులపై పన్నులు విధించాలా? వద్దా? అనే దానిపై నెలల తరబడి చర్చ జరిగిన తర్వాత జనరిక్ ఔషధాలపై సుంకాలను విధించే ప్రణాళికల్ని విరమించుకన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.