Tejas Mk1A: ఇండియా రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది. భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A , అక్టోబర్ 17, 2025న నాసిక్‌లో తన మొదటి అధికారిక విమానయానాన్ని ప్రారంభించింది. తేజస్ Mk1A రాకతో భారత వైమానిక దళం బలం పెరిగి తిరుగులేని శక్తిగా అవతరించే స్థాయికి ఎదిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇదే కార్యక్రమం వేదికగా…
Agni 5 missile test: భారతదేశం బుధవారం అగ్ని-V ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5500 కి.మీ. వరకు ఉంది. దీంతో భారత్ ఇప్పుడు చైనా లేదా పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలదు. ఈ క్షిపణితో కేవలం ఆసియాలో మాత్రమే కాకుండా, యూరప్, ఆఫ్రికాలపై కూడా దాడి చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్షిపణికి అణు బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. దీనిని దాదాపు స్వదేశీ…
IND- US Defense Deals: భారత్‌పై 25 శాతం టారీఫ్స్ తో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా భారత్, రష్యా బంధంపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర నిరాశకు గురైంది.. దీంతో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకు వెళ్లాలనుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా కథనం బ్లూమ్‌బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది
జూన్ 22న అమెరికా తన B-2 బాంబర్ విమానాల నుంచి ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ (GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్) బాంబులను జారవిడిచిన విషయం తెలిసిందే. ఈ వైమానిక దాడిలో ఇరాన్ కి చెందిన ప్రధాన అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసమైంది. వాస్తవానికి, ఇరాన్ పర్వతాల మధ్య భూమికి100 మీటర్ల లోతులో ఫోర్డో అణు కర్మాగారాన్ని నిర్మించింది. ఇది సాధారణ బాంబుల ద్వారా దెబ్బతినే అవకాశమే లేదు. అందుకే అమెరికా ఈ అణు కర్మాగారంపై…