Credit Cards: భారతదేశంలో ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. నెలకు రూ.50 వేల కంటే తక్కువ జీతం సంపాదిస్తున్న వారిలో దాదాపు 93 శాతం మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారని థింక్ 360 ఏఐ ఒక నివేదికను విడుదల చేసింది.