India: వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు జనవరి 4, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. వెనిజువెలా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసింది. సమస్యలను శాంతియుతంగా, సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కారకాస్‌లోని భారత రాయబారం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతరం…