నమీబియా నుంచి 8 చీతాలతో కూడిన ప్రత్యేక కార్గో బోయింగ్ 747 చార్టర్డ్ విమానం శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు.