India vs New Zealand 21st Match Prediction: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు మెగా సమరం జరగనుంది. మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాదు.. ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇరు జట్లు సమవుజ్జీల్లా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఐదవ విజయం ఎవరిదో?.. తొలి ఓటమిని రుచి చూసేదెవరు? అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో…