Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. బిహార్ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు తావులేకుండా పోయింది. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చా జరగకుండానే మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. బిల్లు పాసైన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ…