పొంగల్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదును కానుకగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15న పొంగల్ పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.