కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా వినియోగదారులకు 4జీ సేవలను అందించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సోమవారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4G సేవలను అందిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పైలట్ ప్రాజెక్టులో 700 మెగాహెర్ట్జ్ నుంచి 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో 40-45 ఎంబీపీఎస్…