హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
మణిపూర్‌లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.