ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది.…